11 మంది అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా..

X
అసెంబ్లీ ప్రారంభం కానేలేదు.. అప్పుడే 11 మందికి ఉద్యోగులకు కరోనా సోకిందన్న వార్త అధికారులను కలవరపెడుతోంది. అసోం శాసనసభ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ ఆరోగ్య శాఖ సహాయంతో కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. 270 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్ అని తేలిందని ప్రిన్సిపల్ సెక్రటరీ మృగేంద్ర కుమార్ తెలిపారు. కాగా అసోంలో ఇప్పటి వరకు 52,817 మందికి కరోనా సోకగా, ఒక్క గువాహటిలోనే 17,313 మంది వైరస్ బారిన పడగా, 126 మంది మృత్యువాత పడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
