హిమాచల్ ప్రదేశ్ మంత్రికి, ఆయన కుమార్తెలకు కరోనా పాజిటివ్

హిమాచల్ ప్రదేశ్ మంత్రికి, ఆయన కుమార్తెలకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సుఖ్ రాం చౌదరికి కరోనా పాజిటివ్ అని తేలింది. మంత్రితో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలకు కూడా కరోనా సోకిందని వైద్యులు నిర్థారించారు. దీంతో మంత్రిని కలిసిన ఓ ఎమ్మెల్యే పొంతా సాహిబ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. మంత్రిని సిమ్లాలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి, మంత్రి కుమార్తెలను సిమ్లాలోని కోవిడ్ కేర్ సంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మంత్రి సుఖ్ రాం వ్యక్తిగత సహాయకుడు సోనూ చౌదరికి కరోనా సోకడంతో మంత్రి కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయకు కూడా కరోనా పాటిజివ్ అని తేలింది. మంత్రి చౌదరి త్వరగా కోలుకోవాలని సీఎం జైరాంఠాకూర్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story