అమెరికాలో అరకోటి దాటిన కరోనా కేసులు..

అమెరికాలో అరకోటి దాటిన కరోనా కేసులు..
X

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదేవిధంగా ఉంటోంది. అయితే కోలుకుంటున్న వారి సంఖ్య కాస్త ఆశాజనకంగా ఉంది. రికవరీ కేసులు 25 లక్షలు దాటడం ఊరట నిచ్చే అంశం. ఇదిలా ఉంటే.. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫో సమాచారం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 35 వేలకు పైగా కేసులు నమోదవగా.. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య అరకోటి దాటింది. కాగా, కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నా రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్, జార్జియా వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలు న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా రాష్ట్రాలు వరుసగా ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో నమోదైన యాక్టివ్ కేసుల సంఖ్య 23 లక్షలకు పైగా ఉన్నాయి.

Tags

Next Story