కొండచరియలు విరిగిపడి కేరళలో 12మంది మృతి

కొండచరియలు విరిగిపడి కేరళలో 12మంది మృతి
X

కేరళను వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విపరీతమైన వర్షాలతో కేరళను ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి ఓ స్థావరంపై పడడంతో 12 మంది దుర్మరణం పాలయ్యారు. అటు, మరో 60 మంది ఈ శిథలాల్లో చిక్కుకున్నారు. అయితే, ఇందులో పది మందిని కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతల్లో అధికారులు ‘ఆరెంజ్ అలర్ట్’ ను ప్రకటించారు. మరోవైపు మలప్పురం లో కూడా వరదలు రావడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Tags

Next Story