అద్భుతమైన కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం: ఇజ్రాయెల్

ప్రపంచవ్యాప్తంగా ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే పలు సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ గురించి ప్రకటించింది. తాము కరోనాను తరిమికొట్టడానికి అద్భుతమైనక వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని.. అయితే హ్యూమన్ ప్రయోగం చేయాల్సి ఉందని.. దీని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి బెన్నీ గాంట్జ్ కోవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలను పరిశీలించేందుకు ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ రీసెర్చ్‌ని సందర్శించారు. కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి యాంటీ బాడీస్‌ని ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ తయారీ ముందంజలో ఉందని, ఐఐబీఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ షపీరా వివరించారు. ఈ వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో ఐఐబీర్ ప్రకటించలేదు. భారీ స్థాయిలో ఈ వ్యాక్సిన్‌ని తయారుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com