కరోనా భయం.. భక్తులు లేని ఆలయాలు..

కరోనా భయం.. భక్తులు లేని ఆలయాలు..

నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే శ్రీవారి ఆలయం కొవిడ్ మహమ్మారి భయానికి తలుపులు మూసుకున్నాయి. పర్యాటక ప్రదేశంగా రూపు దాల్చుకున్న తిరుపతి పట్టణంలో భక్తుల సందడే లేదు. సగటున రోజుకి 60వేల మంది ఆ ఏడుకొండల వాడిని దర్శించుకునే భక్తులు తలుపులు వేసుకుని ఇళ్లలో కూర్చోవాల్సి వస్తోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దేవాలయాలు తెరుచుకున్నా దేవుడిని దర్శించుకునే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. శుక్రవారం 7132 మంది మాత్రమే స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇదిలా ఉండగా ధార్మిక సంస్థలు మాత్రం కొవిడ్ మహమ్మారి విస్తృతమవుతున్న నేపథ్యంలో ఆలయాలను తెరవడం శ్రేయస్కరం కాదని భావిస్తున్నాయి. ఈ విషయంలో తమిళనాడును చూసి నేర్చుకోవాలని అంటున్నారు. వ్యాప్తి నియంత్రణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తోందని అంటూ అక్కడి ప్రముఖ దేవాలయాలైన మధుర, కంచి, రామేశ్వరం, కన్యాకుమారి, అరుణాచలం వంటి క్షేత్రాల్లో ఇప్పటికీ భక్తులను అనుమతించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. రూ.10వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలు మాత్రమే తెరిచేందుకు అనుమతి ఇచ్చింది చెన్నై సర్కారు. ఏపీలో మాత్రం ప్రసిద్ధ దేవాలయాలన్నీ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి తెరుచుకున్నాయి.

Tags

Next Story