కరోనాతో 196మంది వైద్యులు మృతి.. ప్రధానికి లేఖ రాసిన ఐఎంఏ

కరోనాతో 196మంది వైద్యులు మృతి.. ప్రధానికి లేఖ రాసిన ఐఎంఏ

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు.. ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. చాలా మంది ప్రాణాలను కూడా కరోనా బలి తీసుకుంటుంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 196 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యులకు కరోనా సోకడంతో.. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ మహమ్మారి బారినపడుతున్నారని తెలిపింది. వైద్యుల కుటుంబ సభ్యులకు కరోనా సోకితే.. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదని ఐఎంఏ సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ ఆర్‌ఏ అశోకన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులకు ఇన్సూరెన్స్‌ తదితర సౌకర్యాలను అందించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రధాని మోదీకి ఐఎంఏ లేఖ రాసింది. కాగా.. ఈ సమయంలో ప్రంట్ లెవెల్ కరోనా వారియర్స్ అయిన వైద్యులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాల్సి ఉంది. లేని యడల చాలా ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story