తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రమంత్రి లేఖ

కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. తెలుగు రాష్ట్రాల సీఎంకు లేఖ రాశారు. అజెండా ఖరారు చేశామని.. త్వరలో అపెక్స్ కౌన్సిన్ సమావేశం ఏర్పాటు చేధ్దామని అన్నారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని లేఖలో వివరించారు. ఆగస్టులోనే సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని తెలిపారు. చర్చల ద్వారా పెండింగ్ పనులను పరిష్కరించుకుందామని అన్నారు. కొత్త ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించాలన్నా.. అపెక్స్ కౌన్సిల్, బోర్డుల అనుమతులు తప్పనిసరని స్పష్టం చేశారు. కచ్చితంగా కొత్తగా నిర్మిచాలనుకునే వారికి అనుమతులు అవరసమని అన్నారు. కాగా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని కూడా లేఖలో గుర్తుచేసిన కేంద్రమంత్రి.. డీపీఆర్‌లు సమర్పించే వరకు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఇచ్చేవరకు టెండర్లు పిలవరాదని, పనులు అప్పగించవద్దని తేల్చి చెప్పారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com