అమిత్ షాకు కరోనా నెగెటివ్

అమిత్ షాకు కరోనా నెగెటివ్
X

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయనకు జరిపిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోస్ సిన్హా ట్వీట్ చేశారు. గతవారం అమిత్ షాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఢిల్లీలో మేదాంత చేరారు. కాగా.. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలడంతో బీజేపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్ ట్వీట్ చేస్తూ.. అమిత్‌షాకు కరోనా నెగెటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నామని అన్నారు. త్వరలోనే షా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Tags

Next Story