మరో కేంద్రమంత్రికి కరోనా

మరో కేంద్రమంత్రికి కరోనా

కరోనా మహహ్మరి తీవ్ర కలకలం రేపుతుంది. సమాన్యులే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్(60) కరోనా బారిన‌ప‌డ్డారు. దీంతో ఆయన ట్రామా సెంటర్ ఆఫ్ ఎయిమ్స్ లో చేర్చారు. ఆయకు కరోనా తీవ్రత చాలా తక్కువగానే ఉందని వైద్యులు చెబుతన్నారు. డాక్టర్ నీరజ్ నిశ్చ‌ల్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్ చికిత్స పొందుతున్నారు. అర్జున్ రామ్ మేఘ్‌వాల్ తో కలిపి ఇప్పటివరకూ నలుగురు కేంద్ర మంత్రులు కరోనా బారినపడ్డారు. అంతకుముందు హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కైలాష్ చౌదరి కరోనా పాజిటివ్‌గా తేలారు.

Tags

Read MoreRead Less
Next Story