సెప్టెంబర్ చివరి నాటికి కరోనా కంట్రోల్: రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు

ఈ ఏడాది మార్చి నుంచి మన దేశ ప్రజలను భయపెడుతున్న కరోనా సెప్టెంబర్ చివరి నాటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. జిల్లాల్లోని ఆస్పత్రులతో పాటు అన్ని వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు.
కరోనా నిర్ధారణ అయిన తరువాత డాక్టర్ల సూచన మేరకు చికిత్సా విధానం అవలంభించాలన్నారు. సరైన సమయంలో మందులు వాడితేనే కరోనా తగ్గుతుందని తెలిపారు. హోమ్ ఐసోలేషన్ సౌకర్యం లేని వారికి కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వెంటిలేటర్ పై ఉండి చికిత్స తీసుకుంటున్న వారికి ప్లాస్మా ఇచ్చినా ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు పెరిగి, మరణాల రేటు తగ్గడం కొంత ఊరట నిచ్చే అంశమని ఆయన అయన అన్నారు. ప్రభుత్వ నివారణ చర్యలతో కరోనా తగ్గుముఖం పడుతుందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com