విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

విజయవాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. రమేష్ ఆస్పత్రిలో హోటల్ స్వర్ణ ప్యాలస్‌ను కోవిడ్ సెంటర్ గా వినియోగిస్తున్నారు. అయితే, సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనా సమయంలో 30 మంది కరోనా రోగులతో పాటు మరో 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆస్పత్రి లోపల నుంచి బాధితులు అరుస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story