సమంత, రష్మిక.. అక్కా చెల్లెళ్లు

సమంత, రష్మిక.. అక్కా చెల్లెళ్లు

ఒకరిని మించి ఒకరు అందమైన ముద్దుగుమ్మలు. స్టార్ హీరోయిన్లు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. ఇలాంటి అరుదైన దృశ్యాలు ఒకప్పుడు శ్రీదేవి, జయప్రద అక్కా చెల్లెళ్లుగా నటించిన సినిమా చూశాము. మళ్లీ ఇన్నాళ్టికి ఓ యువ దర్శకుడు ఆ సాహసం చేసి ఇద్దరు హీరోయిన్లను ఒకే సినిమాలో నటింపజేస్తున్నారు. ప్రతి సినిమాని ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేసే సమంత.. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన కలిసి ఓ సినిమాలో అక్కాచెల్లెళ్టుగా నటించబోతున్నట్లు సమాచారం. లాక్ డౌన్ సమయంలో దర్శకుడు వీరిద్దరి కోసం ఓ కథను సిద్ధం చేశారట. ఆ కథను విని సమంత, రష్మిక ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story