తమిళనాడులో 3లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో 3లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 5,914 కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల 3,02,815కు చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 2,44,675 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 53,099 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు త‌మిళ‌నాడు క‌రోనా మ‌ర‌ణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో114 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా మరణాలు 5,041 చేరింది. అయితే, తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నా.. రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం ఊరట కలిగిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story