ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తమవుతున్న వరదలు

ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తమవుతున్న వరదలు

ఉత్తర, ఈశాన్య భారతదేశంలో కరోనాకు తోడు వర్షాలు కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ధర్చులాలోని కైలాష్‌-మనససరోవర్‌ యాత్ర మార్గంలో రెండుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భాగేశ్వర్‌ సమీపంలో జాతీయ రహదారి 309 ఏపై ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. రవాణ సౌకర్యమే కాకుండా.. ఈ ప్రాంతాల్లో ఇళ్లన్నీ ప్రమాదనికి అంచుల్లో ఉన్నాయి. ఈ వర్షాకాలంలో వారి నివాసాలకు, ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది.

అటు, డెహ్రాడూన్‌ జిల్లాలో కూడా కుండపోత వర్షానికి థంస్సా నది ఉగ్రరూపం దాల్చి వరద తపకేశ్వరస్వామి ఆలయాన్ని తాకింది. రుద్రప్రయాగ్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇండ్లు, రోడ్లు వరదలో కొట్టుకుపోయాయి. మరిన్నిగ్రామాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడి అనేక మంది మృతి చెందుతున్నారు.

Tags

Next Story