సెప్టెంబర్ 30 వరకూ రైళ్లు రద్దు పొడిగింపు

సెప్టెంబర్ 30 వరకూ రైళ్లు రద్దు పొడిగింపు
X

కరోనా కట్టడికి ప్రభుత్వాలు అన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అవసరమైన అన్ని నిబంధనలు అమలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా కొన్ని రైళ్లు రద్దైన విషయం తెలిసిందే. అయితే, ఈ రద్దును సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తున్నాట్టు ప్రకటించింది. సాధారణ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌, ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దును వచ్చే నెల (సెప్టెంబర్‌) ౩౦వ తేదీ వరకు పొడగించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 11 వరకూ రైల్లు రద్దులో ఉన్నాయి. తాజా ప్రకటనతో ఈ రద్దు సెప్టెంబర్ 30 వరకూ కొనసాగుతుంది. ప్రయాణీకులు కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వేశాఖ సూచించింది. ప్రస్తుతం దేశంలో 6,34,945 కరోనా యాక్టివ్‌ కేసులుండగా, 15,35,743 డిశ్చార్జి కేసులున్నాయి. వైరస్‌ ప్రభావంతో 43,386 మంది చనిపోయారు.

Tags

Next Story