కర్నాటకలో వరదలు.. 16 మృతి

కర్నాటకలో వరదలు.. 16 మృతి
X

కర్నాటకను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఓ వైపు కరోనా, మరోవైపు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలతో కర్నాటకలో 16 మంది మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు వరదల వల్ల తీరప్రాంతాల్లో భారీ ఆస్థినష్టం కూడా సంభవించింది. రాష్ట్రంలో మొత్తం 12 జిల్లాలు వరదలకు ప్రభావితం అయ్యాయి. 3,244 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ వరదల వల్ల 28 జంతువులు మరణించగా.. 85 ఇల్లు పూర్తిగా ద్వంసం అయ్యాయి. మరో 3,080 ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు 35వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.

Tags

Next Story