కేరళలో కొండచరియలు విరగిపడిన ఘటనలో 54కి చేరిన మృతుల సంఖ్య

X
By - TV5 Telugu |12 Aug 2020 10:32 PM IST
కేరళలో వరదలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇడుక్కి జిల్లాలోని రాజమలలో కొండచరియలు విరిగిపడి కొందరు మృతి చెందితే.. మరికొందరు గల్లంతయ్యారు. తాజాగా ఈ ఘటనలో మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 54కి చేరింది. ఈ ప్రమాదంలో గల్లంతైన మరో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
కాగా.. ఈ నెల 8న ఇడుక్కి జిల్లాలోని రాజమల ఏరియాలో కొండచరియలు విరిగిపడటంతో పలువురు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాదం జరిగనప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతీరోజు మృతదేహాలు బయటపడుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com