'మహా' పోలీసులపై కరోనా పంజా.. కొత్తగా 264 కేసులు

మహా పోలీసులపై కరోనా పంజా.. కొత్తగా 264 కేసులు

మహారాష్ట్ర పోలీసులపై కరోనా పంజా విసురుతుంది. ప్రతీ రోజు వందల సంఖ్యలో పోలీసులు కరోనా బారినపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 264మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా సోకింది. అటు, ముగ్గురు పోలీసులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 11,362కి చేరగా.. మృతుల సంఖ్య 121కి చేరింది. అయితే 9,187 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 2,084 యాక్టివ్ కేసులు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసు విభాగం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story