దిగుమతి చేసుకున్న కోడి రెక్కల్లో, సీ ఫుడ్ లో కరోనా..

దిగుమతి చేసుకున్న కోడి రెక్కల్లో, సీ ఫుడ్ లో కరోనా..

బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న చికెన్ లో కరోనా వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు దక్షిణ చైనా సిటీ షెంజన్ ప్రభుత్వం గురువారం వెల్లడించింది. మాంసపు మార్కెట్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ విషయం తెలిసింది. చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్ ఆనవాళ్లను అన్వేషించే పనిలో పడింది. దానిలో భాగంగానే ప్రఖ్యాత షింఫడీ సీఫుడ్ మార్కెట్ లో కరోనా వైరస్ ని కనుగొన్నారు. అప్పటి నుంచి ఆ మార్కెట్ పై దృష్టి సారించి మార్కెట్ లోని వ్యాపారులకు, వినియోగ దారులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న కోడి రెక్కల్లో వైరస్ ను గుర్తించారు. కాగా ఈ విషయంపై బ్రెజిల్ ఎంబసీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో పాటు ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న సీఫుడ్ ప్యాకేజీల్లోనూ కరోనా ఉన్నట్లు గుర్తించినట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story