ఎస్.ఎస్. రాజమౌళికి కరోనా నెగిటివ్

ఎస్.ఎస్. రాజమౌళికి కరోనా నెగిటివ్

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ ఎస్.ఎస్. రాజమౌళితో పాటు తన ఫ్యామిలీకి కరోనా నెగిటివ్ అని తేలింది. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందని ఆయన జూలై 29న ట్వీట్ చేశారు. అయితే, కరోనా లక్షణాలు తక్కువగా ఉండటంతో హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. మొత్తం ఇప్పటివరకూ రెండు వారాల హోం ఐసోలేషన్ పూర్తైంది. తరువాత మరోసారి పరీక్షలు చేయగా కరోనా నెగెటివ్ అని తేలింది. దీంతో ఆయన తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్ అని తేలిందని ట్వీట్ చేశారు. మరోవైపు అయితే, ప్లాస్మా దానం చేయడానికి మరో మూడు వారాలు వెయిట్ చేయాలని డాక్టర్ చెప్పారని అన్నారు. కాగా.. కరోనా నుంచి కోలుకున్న తరువాత ప్లాస్మా దానం చేస్తామని గతంలోనే చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story