రామ జన్మ భూమి ట్రస్ట్ ఛైర్మన్ కి కరోనా

అయోధ్య రామ జన్మ భూమి ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కరోనా బారిన పడ్డారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో కోవిడ్ నిర్ధారణ అయింది. కృష్ణ జన్మాష్టమి వేడుకల నిమిత్తం మధుర వెళ్లిన ఆయనకు ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోని బృందం చికిత్స అందిస్తోంది. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మహంత్ ను గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించనున్నామని మధుర జిల్లా మెజిస్ట్రేట్ రామ్ మిశ్రా తెలిపారు. కాగా గతవారం (ఆగస్టు 5న) ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్వహించిన రామ మందిర భూమి పూజ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. కాగా భూమి పూజకు కొద్ది రోజుల ముందు పూజారి ప్రదీప్ దాస్ మరో 14 మంది పోలీసులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com