ఏం జరిగినా తట్టుకునే దైర్యం దేవుడు నాకివ్వాలి: ప్రణభ్ ముఖర్జీ కుమార్తె

తన తండ్రి విషయంలో ఏం జరిగినా.. దానిని తట్టుకునే దైర్యం దేవుడు తనకు ఇవ్వాలని మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ ముఖర్జీ ట్వీట్ చేశారు. తన తండ్రి త్వరగా కలుకోవాలని ప్రార్థిస్తున్న వారందరికీ షర్మిష్ఠ కృతజ్ఞతలు తెలిపారు.

2019 ఆగస్టు 8 అంటే తనకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం అని.. ఆరోజు తన తండ్రి భారత అత్యున్నత పురష్కారం భారతరత్న ఆరోజు అందుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఏడాది తిరిగేసరికి ఈ ఆగస్టు 10న ఆయన ఆనారోగ్యానికి గురైయ్యారని.. ఆయన విషయంలో ఏది మంచి అయితే భగవంతుడు అదే చేస్తే మంచిదని అన్నారు. సంతోషం అయినా.. భాద అయినా.. దాన్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ.. ఆయన బాగోగలను కోరుకుంటున్న వారందరికీ కృతజ్ఞతలు ప్రకటిస్తున్నాని షర్మిష్ఠ ప్రకటించారు.

Tags

Next Story