కోస్తాంధ్రకు భారీ వర్షసూచన

కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వాహణశాఖ హెచ్చరింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడనుందని.. రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, యానాంలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. 3.5 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అలలతో సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story