కరోనాకు ఓ మంచి చిట్కా చెప్పిన బీజేపీ ఎంపీ

వ్యాక్సిన్ ఎందుకు.. బురదలో కూర్చుని శంఖం ఊదితే చాలు.. కరోనా కనిపించకుండా పారిపోతుంది అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు రాజస్థాన్ బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనపూరియా. ఓ వైపు కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధకులు అహోరాత్రులు శ్రమిస్తుండగా ఎంపీ తాను చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఒంటికి బురద రాసుకుని, శంఖం ఊదితే నోవెల్ కరోనా వైరస్ పరారైపోతుందని తెలిపారు. బురదలో కూర్చోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. దాంతో వైరస్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని సుఖ్‌బీర్ చెప్పుకొచ్చారు.
గతంలో కూడా ఎంపీ ఇదే తరహాలో పలు సూచనలు చేశారు. ఒంటికి బురద రాసుకుని యోగా చేస్తే ఎలాంటి జబ్బులైనా మటు మాయం అని వ్యాఖ్యానించారు. మరో కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన ఒకసారి భాభీజీ అప్పడాల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించే పదార్థాలు ఉన్నాయి. అవి తింటే కరోనా రమ్మన్నా రాదు అని పేర్కొనడం విమర్శలకు దారితీసింది. అసలు విషయం ఏంటంటే.. ఇప్పుడు ఆయనకు కరోనా వచ్చి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com