మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జబల్ పూర్-నాగపూర్ జాతీయ రహదారిపై బియ్యం, బత్తాయి లోడుతో వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు్న్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

Tags

Next Story