కరోనా నుంచి కోలుకున్న సిద్దరామయ్య

కరోనా నుంచి కోలుకున్న సిద్దరామయ్య

కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు రెండోసారి కరోనా టెస్టు చేయగా.. నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో మణిపాల్ ఆస్పత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయినపుడు ఆస్పత్రి సిబ్బందికి సిద్దారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 3న ఆయన మూత్ర సంబంధ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. పదిరోజులు మణిపాల్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించిన తరువాత వైద్యులు మరోసారి కరోనా టెస్టు చేయగా నెగిటివ్ అని తేలింది. దీంతోఆయన గురువారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే, కరోనా నిబంధనల ప్రకారం మరో వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కాగా.. సిద్ద‌రామయ్య కుమారుడు కూడా ఈ నెల 7న కరోనా బారిన పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story