2036నాటికి యువభారత్ నుంచి వృద్ధ భారత్
X
By - TV5 Telugu |14 Aug 2020 3:17 PM IST
ప్రస్తుతం అత్యధిక యువత ఉన్న దేశాల్లో భారత్ ముందువరుసలో ఉంది. అయితే, ప్రస్తుతం యువభారత్ గా ఉన్న మన దేశం 2036నాటికి వృద్ధ భారత్ మారుతుందని ఓ అధ్యయనంలో తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 0-24 ఏళ్ల మధ్య వయసున్న వారు 50.2శాతం ఉన్నారు. కానీ, 2036నాటికి ఇది 25.3శాతానికి పడిపోతుందని ఈ అధ్యయనం చేసిన బృందం తన నివేదికలో వెల్లడించింది. జననాల రేటు తగ్గటం, జీవితకాలం పెరుగటం కూడా దేశంలో వృద్ధుల జనాభా పెరుగటానికి మరో కారణం అవుతుందని పేర్కొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com