ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్..

ఆంధ్రప్రదేశ్ లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. కరోనా వైరస్ తో లాక్ డౌన్ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 17 నుంచి 25 తేదీల్లో పీఈసెట్, అక్టోబర్ 1న ఎడ్ సెట్, 2న లాసెట్ నిర్వహిస్తారు. ఇక తెలంగాణలో ఈనెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9,10,11,14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్ సెట్, ఐసెట్, పీఈసెట్ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్ స్లాట్స్ ను బట్టి ఖరారు చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com