కరోనా నుంచి కోలుకున్న తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్

X
తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి ఆయనకు కరోనా పరీక్షల్లో జరపగా.. నెగిటివ్ అని తేలింది. దీనిపై చెన్నైలోని కావేరీ ఆస్ప్రత్రి సిబ్బంది మాట్లాడుతూ.. గవర్నర్ ధైర్యం, సంకల్పం కరోనాను జయించడానికి కారణమయ్యాయని అన్నారు. గవర్నర్ పురోహిత్ కరోనా నుంచి కోలుకొని చురుకుగా ఉన్నారని చెప్పారు. ఆయనకు కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో హోం ఐసోలేషన్ లోనే కావేరీ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. కాగా.. రాజ్‌భవన్‌లో 84 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. రెండు వారాల నుంచి గవర్నర్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తమిళనాడులో ఇప్పటికే ముగ్గురు మంత్రులు కరోనా బారిన పడి, కోలుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
