కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్‌కు కరోనా

ఇటీవల అనేకమంది ప్రముఖులు కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్‌కు కరోనా బారిన ప‌డ్డారు. త‌న‌కు క‌రోనా సోకిన‌ట్లుగా ఆయనే స్వయంగా ట్విట్ట‌ర్ ద్వారా ప్రకటించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ హోం ఐసోలేష‌న్‌లో ఉంటున్న‌ట్లు తెలిపారు. ఇటీవల తనకు కలిసిన వారంత స్వీయ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలని ఆయ‌న కోరారు. కరోనా నుంచి త్వరగా కోలుకుని అంద‌రినీ క‌లుస్తాన‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న‌ పేర్కొన్నారు.

Tags

Next Story