ఏపీ సర్కార్‌పై నారాలోకేష్ వ్యంగ్యాస్త్రాలు

ఏపీ సర్కార్‌పై నారాలోకేష్ వ్యంగ్యాస్త్రాలు

ఏపీ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ పాలనను, ఆయన ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానాన్ని నచ్చి ఏపీకి పలు కంపెనీలు, బ్రాండ్లు వచ్చాయని మద్యం కంపెనీల ఫోటోలను ఫోస్టు చేశారు. ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న మద్యం పాలసీపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. గతంలో లేని బ్రాండ్లు తీసుకొచ్చి.. రేట్లు పెంచారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ఈ విషయాన్ని సెటైరికల్ గా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలో వచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో వచ్చిన కంపెనీలు ఇవి తప్ప ఏవని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story