రష్యా కరోనా వ్యాక్సిన్ తయారీకి భారతీయ కంపెనీలు ఆసక్తి!

రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ పై భారతీయ ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. రష్యా వ్యాక్సిన్ అయిన స్పుత్నిక్ వి కి చెందిన 1,2 దశల క్లినికల్ ట్రయల్స్‌కు సమాచారాన్ని అందించాలని భారతీయ కంపెనీలు రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)ను కోరాయి. ఈ వ్యాక్సిన్ తయారీకి ఆర్డీఐఎఫ్ నిధులు సమకూర్చిన విషయం తెలిసిందే. ఈ టీకాపై సర్వ హక్కులు ఆర్డీఐఎఫ్‌కు ఉన్నాయి. మార్కెటింగ్ చేయడం, ఎగుమతి చేయడం వంటివి అన్ని ఆర్డీఐఎఫ్ చేస్తుంది. దీంతో ఈ సంస్థతో భారతీయ కంపెనీల చర్చలు చేస్తున్నట్టు సమాచారం. అయితే, చర్చలు సఫలం అయితే ఈ వ్యాక్సిన్‌ను భారతదేశంలో ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు ఏర్పడతాయి. ఈ టీకాను రష్యాకు చెందిన మైక్రో బయాలజీ రీసెర్చ్ సెంటర్ గమ్‌లెయా అభివృద్ధి చేస్తోంది. ఈ టీకా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com