15 Aug 2020 8:26 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / మోదీకి కాల్ చేసిన...

మోదీకి కాల్ చేసిన నేపాల్ ప్రధాని

మోదీకి కాల్ చేసిన నేపాల్ ప్రధాని
X

నేపాల్ ప్రధాని కే.పీ. శర్మ ఓలి.. భారత్ ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేశారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌తదేశ ప్ర‌జ‌ల‌కు ఓలీ శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఐక్య‌రాజ్య స‌మితి నాన్ పెర్మ‌నెంట్ స‌భ్య‌త్వానికి భారత్ ఎన్నికైనప్పుడు కూడా ఓలీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాను అదుపు చేయడానికి ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుందామని ఇరువురు ప్రధానులు మాట్లాడుకున్నారు. నేపాల్ కు అన్ని విధాల భారత్ సహకరిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల కాలంలో సరిహద్దు ప్రాంతాల విషయంలో భారత్ పై నేపాల్ ప్రధాని ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Next Story