పంజాబ్‌లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

పంజాబ్‌లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ ఇటీవల పంజాబ్ లోని కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా కేసులు మాత్రమే కాదు.. కరోనా మరణాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పంజాబ్ 1,077 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 29,013కి చేరాయి. అటు, కరోనా మరణాలు కూడా కొత్తగా 25 మంది మృతి చెందగా, ఇప్పటివరకూ కరోనాతో 731 మంది చనిపోయారు. కాగా ఇప్పటివరకూ కరోనా నుంచి 18,328 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 9,954 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story