గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నడియార్ వద్ద రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడకక్కడే మరణించారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాధమిక విచారణలో తేలింది.

Tags

Next Story