రాష్ట్రంలో 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 894 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్క గ్రేటర్ పరిధిలోనే 147 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 92,255 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వైరస్ బారిన పడి 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 703కు చేరింది. ఈరోజు 2,006 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. కాగా మొత్తం డిశ్చార్జ్ అయిన వారు 70,132 మంది, చికిత్స పొందుతున్నవారు 21,420 మంది. ఇంట్లో, ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నవారు 14,404 మంది.
ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య 7,53,349 చేరుకుంది. రంగారెడ్డి జిల్లాలో 85, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో 51 పాజిటివ్ కేసులు నమోదు కాగా, భద్రాద్రి కొత్తగూడెంలో 9, ఖమ్మంలో 44, వరంగల్ అర్బన్ జిల్లాలో 44, వరంగల్ గ్రామీణ జిల్లాలో 7, సిద్ధిపేట జిల్లాలో 58, సిరిసిల్ల జిల్లాల్లో 2, గద్వాల జిల్లాల్లో 21, పెద్దపల్లి జిల్లాల్లో 62, సూర్యాపేట జిల్లాల్లో 12, నిజామాబాద్ 38, మహబూబాబాద్ జిల్లాల్లో 21 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com