తమిళనాడులో కరోనా ఉదృతి.. కొత్తగా 6వేలు కేసులు

X
తమిళనాడులో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజుల నుంచి ప్రతీరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,950 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు, కరోనా మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 125 మంది మరణించారు. తాజాగా నమోదైన కరోనా కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,38,055కు చేరింది. అటు, మరణాల సంఖ్య 5,766కు చేరింది. అయితే, తమిళనాడులో కరోనా రికవరీ రేటు గణనీయంగా ఉంది. ఇప్పటివరకూ 2,78,270 మంది కోలుకోగా.. 54,019 మంది చికిత్స పొందతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
