అతిచిన్న వయసు ముఖ్యమంత్రుల జాబితాలో జగన్..

Update: 2019-05-30 11:11 GMT

ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం దేశంలో పదవిలో ఉన్న అతిచిన్న వయసు ముఖ్యమంత్రుల్లో జగన్ ఒకరు. ఏజ్ పరంగా చూస్తే జగన్ ఐదో స్థానంలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ఈ మధ్యే ప్రమాణస్వీకారం చేసిన ఫెమాఖండు అతిచిన్న వయసున్న సీఎంగా రికార్డు సృష్టించారు. ఈయన ఏజ్ 39 సంవత్సరాలు. రెండోస్థానంలో మేఘాలయ సీఎం కర్నాడ్ సంగ్మా ఉన్నారు ఈయన వయస్సు 41 సంవత్సరాలు. థర్డ్ ప్లేస్ లో గోవా సీఎం ప్రమోద్ సావంత్ నిలిచారు. ఈయన ఏజ్ 46 సంవత్సరాలు . నాలుగో ప్లేస్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉంటే..ఇక ఐదో ప్లేస్ లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం జగన్ వయస్సు 46 సంవత్సరాలు.

త్రిపుర సీఎంగా ఉన్న బిప్లవ్ దేబ్ అతిచిన్న వయస్సున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆరోస్థానంలో ఉన్నారు. ఈయన ఏజ్ 47 సంవత్సరాలు.మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏడోస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ది. ఈయన వయస్సు 50 సంవత్సరాలు. ఇక సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జైరామ్ ఠాకూర్ పదోస్థానంలో నిలిచారు. మొత్తానికి దేశంలోని పది రాష్ట్రాలకు 54 ఏళ్ల లోపు ఉన్నవారే సీఎంగా ఉన్నారు.

Similar News