CBN: సూపర్‌ సిక్స్‌తో జగన్‌కు నిద్ర పట్టడం లేదు

నవరత్నాల పేరుతో జగన్ నవ మోసాలు చేశారన్న చంద్రబాబు... ప్రజల భూములపై హక్కు లేకుండా చేయాలని జగన్ కుట్రలు

Update: 2024-05-06 03:30 GMT

సూపర్‌సిక్స్, మోదీ హామీలు చూసి జగన్‌కు నిద్రపట్టడం లేదని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. నవరత్నాల పేరుతో జగన్ నవ మోసాలు చేశారని మండిపడ్డారు. జగన్, పెద్దిరెడ్డి తోడు దొంగలని అన్నింట్లోనూ దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకమూ ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.ప్రజల భూములపై హక్కు లేకుండా చేయాలని జగన్ కుట్రలు చేస్తున్నారని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రంహ వ్యక్తం చేశారు. చీకటి చట్టాలు తెచ్చి.... భూములు కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు.అరాచక ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. NDA కూటమి అధికారంలోకి వస్తుందని... ఇక మిగిలింది ప్రమాణస్వీకారానికి ముహుర్తమేనని అన్నారు. అమరావతిని నాశనం చేసిన జగన్‌ను ఇంటికి పంపాల్సిందేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమరావతిని దేశంలోనే నెంబర్‌ వన్‌ రాజధానిగా చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని భరోసా ఇచ్చారు.


మన ఆశలను సైకో జగన్‌ సర్వనాశనం చేశారు. రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. అమరావతి నిర్మాణానికి కూటమి అభ్యర్థులను గెలిపించారు. పోలవరం పూర్తిచేసి హంద్రీనీవాతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తాం. రాయలసీమ ద్రోహి జగన్‌. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేదు. ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రాష్ట్రానికి జగన్‌ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఏటా 4లక్షలు చొప్పున 20లక్షల ఉద్యోగాలిస్తాం. ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తాం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. సమర్థ నాయకత్వం ఉండి కేంద్ర సహకారం తీసుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుంది’’అని చంద్రబాబు అన్నారు.

‘‘ ప్రజలు గెలవాలి.. దుర్మార్గుడిని ఇంటికి పంపాలని అమిత్‌షా చెప్పారు. జగన్‌ మూడు రాజధానుల పేరుతో అసలు రాజధానే లేకుండా చేశారు. అమరావతిని నాశనం చేసిన ఆయన్ను ఇంటికి పంపాల్సిందే. అధికారంలోకి వచ్చాక అమరావతిని దేశంలోనే నంబర్‌ వన్‌ రాజధానిగా తీర్చిదిద్ది ప్రపంచపటంలో పెట్టే బాధ్యత ఎన్డీయేది. కేంద్రం, రాష్ట్రం కలిసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. అమరావతికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టంగా చెప్పారు. పోలవరంపై నిర్దిష్ట హామీ ఇచ్చారు.

Tags:    

Similar News