రెండో సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ ప్రముఖులకు నివాళులర్పించారు. ఉదయాన్నే రాజ్‌ఘాట్‌ను సందర్శించిన మోదీ.. జాతి పిత మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మోదీతో పాటు అమిత్ షా ఇతర బీజేపీ ముఖ్యనేతలు కూడా నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని వాజపేయ్ ఘాట్‌కు చేరుకున్నారు ప్రధాని. వాజ్‌పేయ్‌కు నివాళి అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. అక్కడి నుంచి వార్ మెమోరియల్‌కు చేరుకున్నమోదీ.. అమర సైనికులకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల త్యాగాలను ప్రధాని స్మరించుకున్నారు.