రాజమండ్రి టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్‌ను పరామర్శించారు మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్… వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న మురళీమోహన్ కోలుకుంటున్నారు… హైదరాబాద్‌లోని మురళీమోహన్ ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు చంద్రబాబు… త్వరగా కోలుకోవాలని బాబు, లోకేష్ ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటించాలని, పూర్తిగా నయమయ్యేవరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు…