తిరుపతిలో భూమన అరాచకాలు.. సామాన్యులకు ఇబ్బందులు..

Update: 2026-03-17 11:15 GMT

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి.. కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎంతటి అరాచకాలు సృష్టిస్తున్నారో మనందరం చూస్తున్నాం. ఏకంగా ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి అలజడి సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు టిటిడి లడ్డు కల్తీ నెయ్యి కేసు ఎంత సంచలనం రేపుతుందో మనందరం చూస్తున్నాం. భూమన హయాంలోనే టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయని తేలుతున్నాయి. ఓవైపు సిబిఐ నియమించిన సిట్ నివేదికలోనే కల్తీ నెయ్యి తయారు చేసి లడ్డూల్లో కలిపేసి కోట్లాదిమంది హిందువులతో తినిపించారు అంటూ రిపోర్టు వచ్చింది. అప్పటినుంచి హిందువులు భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి, వైసిపి మీద జగన్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. హిందువుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ల తీరు ఉంది అంటూ ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు.

ఇంకోవైపు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ వేగంగా విచారణ చేస్తోంది. ఈ విచారణలో అసలు నిందితులు మొత్తం బయటపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి తన మీద నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద రకరకాల కుట్రలు చేస్తున్నారు. కొన్ని రకాల ఫోటోలను ఎడిట్ చేసి, వీడియోలను ఏఐ సాయంతో క్రియేట్ చేసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై ఇప్పటికే బీఆర్ నాయుడు గారు ఫిర్యాదు చేశారు. అలాగే ఆ వీడియోలో ఉన్న సదరు మహిళ కూడా తమపై తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు అని పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇంత చేసినా సరే భూమన కరుణాకర్ రెడ్డి కుట్రలు మాత్రం ఆపట్లేదు.

తాజాగా తిరుపతిలో తన అనుచరులతో ధర్నా చేయిస్తున్నారు. బీఆర్ నాయుడు గారిని తప్పించాలని పనికిమాలిన నినాదాలు చేస్తున్నారు. వీళ్ళ ధర్నాతో పదో తరగతి పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు తిరుమల దర్శనానికి వస్తున్న భక్తులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి అవస్థ పడుతున్నారు. వీళ్ళందరూ వైసిపి చేస్తున్న ఈ పనికిమాలిన ధర్మాను తీవ్రంగా తప్పుపడుతున్నారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. అయినా సరే భూమన కరుణాకర్ రెడ్డి అవేవీ పట్టించుకోకుండా తన స్వార్థం కోసం ఇలాంటి పసలేని ఆరోపణలు చేయిస్తూ.. పబ్బం గడుపుతున్నారు.

Tags:    

Similar News