రిటైర్ అయ్యేలోపు 'ఓ బేబీ' చేసినందుకు చాలా హ్యాపీ: సమంత

Update: 2019-06-10 10:17 GMT

ఇంతకు ముందు సమంత అంటే ఓ హీరోయిన్ మాత్రమే. కానీ అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టాక.. అంచనాలు మారిపోయాయి. వచ్చిన ఆఫర్లన్నీ ఓకే చేయకుండా ఆచి తూచి అడుగేస్తోంది. ది బెస్ట్‌గా తన ఫెర్మామెన్స్‌ని అందిస్తోంది సమంత తన ప్రతి చిత్రంలో. అలా వచ్చిన మహానటి, రంగస్థలం, సూపర్ డీలక్స్, మజిలీ చిత్రాలు తనకెంతో పేరు తెచ్చాయి. తాజాగా ఓ బేబీ అంటూ జులై 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకురాలు నందిని రెడ్డి ఈ కొరయన్ చిత్రాన్ని సమంతతో చేయాలనుకుని తనని సంప్రదించిందట. కథ విపరీతంగా నచ్చేయడం.. అందునా అది ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర కావడంతో హ్యాపీగా చిత్రం పూర్తి చేసింది సమంత. నేను రిటైర్ అయ్యే లోపు ఓ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ సినిమా చేయాలనుకున్నాను అది ఓ బేబీతో తీరడం చాలా సంతోషంగా ఉంది అని సమంత చెప్పుకొచ్చింది. ఈ సినిమా కొరియన్ వెర్షన్ చూసినప్పుడు మా అమ్మని హగ్ చేసుకోవాలనిపించింది. ప్రతి తల్లి తన పిల్లల కోసం చాలా త్యాగం చేస్తుంది. కానీ వాటి గురించి ఎప్పుడూ మాట్లాడరు. ఈ సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరూ వెళ్లి అమ్మా.. నీకల ఏంటి అని అడుగుతారు.. హగ్ చేసుకుంటారు అని చెప్పింది సమంత. ఓ బేబి సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్ అంటూ వివరించింది.

Similar News