Family Star : ఓటీటీలో అదరగొడుతున్న ఫ్యామిలీ స్టార్

Update: 2024-04-30 10:07 GMT

విజయ దేవరకొండ హీరోగా పరశురాం కాంబోలో వచ్చిన చిత్రం ఫ్యామిలీ స్టార్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతగోవిందం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో రెండో సినిమా కావడం .. పైగా మృణాల్ ఠాకూర్ హిట్ స్ట్రీక్ లో ఉన్న సమయంలో వస్తున్నా సినిమా కావడంతో ఇది కూడా హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా వేరే ఫలితాన్ని ఈ చిత్రం అందుకుంది. ఈ నెల 5న భారీ అంచనాల మధ్య ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

రీసెంట్ గానే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి రాగా ఇక్కడ కూడా నెగిటివ్ కామెంట్స్ తోనే స్టార్ట్ అయ్యింది. కానీ ఓటిటిలో మాత్రం అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇంకా హిందీ వెర్షన్ లాంటిది ఏమి రాకుండా ఇండియా వైడ్ గా ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ లోకి రావడం విశేషం. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ మూవీ ఓటీటీలో సత్తా చూపుతుండడం విశేషం. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.

విజయ్ దేవరకొండ హీరోగా చేసిన తొలి మూవీ పెళ్లిచూపులు (2016) సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి (2017), గీతగోవిందం (2018) చిత్రాలు బ్లాక్‍బస్టర్లు అవటంతో విజయ్ కెరీర్ గ్రాఫ్ కొన్నేళ్లకే చాలా పెరిగిపోయింది. యూత్‍లో ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే, గీతగోవిందం తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ మాత్రం విజయ్ దేవరకొండకు తగ్గలేదు. మధ్యలో టాక్సీవాలా (2018) పర్వాలేదనిపించినా.. నోటా (2018), డియర్ కామ్రెడ్ (2019), వరల్డ్ ఫేమస్ లవర్ (2020) తీవ్రంగా నిరాశపరిచాయి. లైగర్ (2022) సినిమాతో పాన్ ఇండియా రేంజ్‍లో గుర్తింపు వచ్చినా అది అల్ట్రా డిజాస్టర్ అయింది. గతేడాది ఖుషి (2023)ది అదే పరిస్థితి.

Tags:    

Similar News