గొర్రెల కాపరిని అదృష్టం వరించింది.. వజ్రం..

Update: 2019-06-11 07:19 GMT

కర్నూలు జిల్లాలో ఓ గొర్రెల కాపరిని అదృష్టం వరించింది. తుగ్గలి మండలం గ్రామాల్లో ప్రతి ఏటా తొలకరి జల్లులు మొదలవగానే వజ్రాల వేట ప్రారంభమవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే మకాంవేసి ప్రజలు వజ్రాల వేట కొనసాగిస్తుంటారు. అందరిలాగే జొన్నగొరి గ్రామస్థుడైన ఓ గొర్రెలకాపరి కూడా వజ్రాల వేటకొచ్చాడు. లక్కీగా అతనికి వజ్రం దొరికింది. విషయం తెలుసుకున్న స్థానిక వ్యాపారి బహిరంగ వేలం నిర్వహించి 20 లక్షలకు కొనుగోలు చేశాడు. బహిరంగ మార్కెట్‌లో దాని విలువల 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే అమాయక గ్రామస్థుల నుంచి వజ్రాల దళారులు తక్కువ రేటుకు కొని ఓపెన్ మార్కెట్ లో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Similar News