కొత్తగా మరో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన సీఎం జగన్

Update: 2019-06-12 04:39 GMT

పదవుల సర్దుబాటులో సీఎం జగన్‌కు తలనొప్పులు తప్పడం లేదు. మంత్రి పదవులు ఆశించిన కొందరు నేతలు.. అలక పూనడంతో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మరో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించారు. సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డికి విప్ పదవి ఇచ్చారు. ఇప్పటికే చీఫ్‌ విప్‌గా శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌లుగా ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులును కొనసాగిస్తూనే మరో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఐతే.. సీనియర్ నేత మాజీ మంత్రి పార్థసారధి విప్‌గా ఉండేందుకు ఇష్టపడకపోవడంతో ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Similar News