జగన్ సూచన మేరకు జనం బాట పట్టిన మంత్రులు

Update: 2019-06-15 12:32 GMT

నిత్యం జనంలో ఉంటూ సమస్యల పరిష్కారినికి కృషి చేయాలన్న సీఎం జగన్ సూచనల మేరకు జనం బాట పట్టారు మంత్రులు. ఇందులోభాగంగా డిప్యూటీ సీఎం ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. వైద్యాఆరోశ్య శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సర్వజనాసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అస్పత్రుల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చుచేస్తామని సీఎం జగన్ చెప్పినట్లు మంత్రి వివరించారు. సర్వజనాసుపత్రిలో తనిఖీలు చేపట్టిన అనంతరం కలెక్టర్, ఆస్పత్రి డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

మరోవైపు డిప్యూటీ సీఎం అంజద్ భాషా కడపలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠాశాల ఆవరణలో చేపట్టిన టాయిలెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

అవినీతిరహిత పాలన అందించటమే తమ లక్ష్యమని అన్నారు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత జిల్లాలో పర్యటించిన ఆమెకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం..జిల్లా సమస్యలపై చర్చించారు. నవరత్నాలను వంద శాతం అమలు చేసి తీరుతామని అన్నారామె.

Similar News