మాలి దేశంలో ఏరులై పారిన రక్తం.. కారణం ఏంటంటే..

Update: 2019-06-21 01:12 GMT

ఆఫ్రికాలోని మాలి దేశంలో రక్తం ఏరులై పారింది. రెండు జాతుల మధ్య వైరం 38 మంది అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. డోగాన్ జాతికి చెందిన ప్రజలు నివసిస్తున్న రెండు గ్రామాలపై ఉగ్రమూకలు దాడులకు తెగపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో 38 మంది మరణించారు. ఫులానీ జాతికి చెందిన తీవ్రవాదులే దాడులకు పాల్పడ్డారని అధికారులు భావిస్తున్నారు.

మాలిలో డోగాన్, ఫులానీ జాతి ప్రజలకు కొన్ని ఏళ్లుగా వైరం కొనసాగుతుంది. ఇరు సామాజిక వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోసారి దాడులు చేశారు. దాడి జరిగిన విషయం తెలియగానే భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని, ప్రజలకు రక్షణ కల్పించే చర్యలను చేపట్టాయని వివరించారు.

Similar News