ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ..

Update: 2019-06-22 04:03 GMT

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 42 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా మధుసూదన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్‌, కార్మిక, ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉదయలక్ష్మి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా కాంతిలాల్‌ దండే, ఆరోగ్యశ్రీ సీఈవోగా మల్లికార్జునను నియమించారు. సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రవిచంద్ర, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ముఖేష్‌కుమార్‌, కార్మిక శాఖ కమిషనర్‌గా వరప్రసాద్‌, బీసీ కార్పొరేషన్‌ ఎండీగా రామారావు, ఏపీ ఎండీసీ ఎండీగా భానుప్రకాశ్‌, టూరిజం ఎండీగా ప్రవీణ్‌కుమార్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా ప్రసన్నవెంకటేష్‌ నియమితులయ్యారు.

జీవీఎంసీ కమిషనర్‌గా సృజనను నియమించారు. బీసీ కార్పొరేషన్‌ ఎండీగా రామారావు, కడప జాయింట్‌ కలెక్టర్‌గా గౌతమి, కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా మాధవీలత, గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా దినేష్‌కుమార్‌, అనంతపురం మున్సిపల్‌ కమిషనర్‌గా ప్రశాంతి, శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా మార్కండేయులను నియమించారు.

పార్వతీపురం ఐటీడీఏ పీవోగా వినోద్‌కుమార్‌, జేఏడీ కార్యదర్శిగా శశిభూషణ్‌ నియమితులయ్యారు. వెంకయ్యచౌదరి, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, నాగరాణిలను జేఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

Similar News